విశాఖలో విజయశ్రీ ఫార్మా కంపెనీలో పేలుడు - తప్పిన పెను ప్రమాదం


విశాఖపట్నంలోని పరిశ్రమల్లో పదే పదే అగ్ని ప్రమాదాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. విశాఖలో ఈ రోజు ఉదయం మరో పరిశ్రమలో పేలుడు సంభవించి మంటలు ఎగిసిపడ్డాయి. అచ్యుతాపురం సెజ్‌లోని విజయశ్రీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. పరిశ్రమ నుంచి కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఫార్మా కంపెనీలో పేలుడు ధాటికి అక్కడి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. సమీపంలోనే అగ్నిమాపక యంత్రం ఉండడంతో దాని ద్వారా అక్కడి సిబ్బంది మంటలను అదుపు చేశారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post