మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ లంచం తీసుకుంటూ ఎసిబి వలలో - 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ లంచం కేసులో మెదక్ అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ కు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. రూ. 1.12 కోట్ల  లంచం కేసులో నగేశ్ తో పాటు నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి, చల్పిచేడు తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీం మహ్మద్, నగేశ్ బినామీ జీవన్ గౌడ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. 112 ఎకరాల భూమికి ఎన్వోసీ ఇవ్వడం కోసం ఈ లంచాన్ని నగేశ్ డిమాండ్ చేశారు. ఎకరాకు రూ. లక్ష చొప్పున 112 ఎకరాలకు రూ. 1.12 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.


0/Post a Comment/Comments

Previous Post Next Post