దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 47,54,357


 

భార‌త్ లో క‌రోనా కేసులు, మృతుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 47 లక్షలకు దాటింది. గత 24 గంటల్లో దేశంలో 94,372 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 47,54,357కు చేరింది.గ‌త 24 గంట‌ల సమయంలో 1,114 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 78,586  కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 37,02,596  మంది కోలుకున్నారు. 9,73,175 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.దేశంలో నిన్నటి వరకు మొత్తం 5,62,60,928 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,71,702  శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post