అంతర్వేదిలో దగ్ధమైన స్వామివారి రథం- కేసు సిబిఐ కి : సియం జగన్


 

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అంతర్వేదిలో స్వామివారి రథం అగ్నికి ఆహుతైన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో హిందూ మతంపై దాడి జరుగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనకు కారకులైన దోషులు ఎవరైనా సరే కఠిన శిక్ష పడాలన్న భావనతో కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ డీజీపీని ఆదేశించారు. దీంతో, సీబీఐ దర్యాప్తును కోరుతూ కేంద్ర హోంశాఖకు డీజీపీ కార్యాలయం లేఖ రాసింది. దీనికి సంబంధించి రేపు జీవో వెలువడనుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post