ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ ను ప్రారంభించిన కరీంనగర్ జిల్లా విద్యాధికారి


 

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం : దేశవ్యాప్తంగా 15 ఆగస్టు నుండి 2 అక్టోబర్ వరకు నిర్వహిస్తున్న పిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ లో భాగంగా మంగళవారం జంగపల్లి ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఫిట్ ఇండియా ఫ్రీడమ్ 2K రన్ ను కరీంనగర్ జిల్లా విద్యాధికారి Ch.V.S. జనార్దన్ రావు ప్రారంభించగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు విద్యార్థులకు రన్ గురించిన కోవిడ్ నిబంధనలు వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య  అతిధులుగా ఎం.పీ.టీ.సీ అట్టికం రాజేశం మరియు జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య కార్యదర్శి కనకం సమ్మయ్య విద్యా కమిటీ చైర్మన్ బండి తిరుపతి పాల్గొన్నారు పరుగులో పాల్గొన్న విద్యార్థులకు గ్రామ సర్పంచ్ అటిక శారద శుభాభినందనలు తెలియజేశారు  ఈ టూకే రన్ పాఠశాల నుండి ప్రారంభమై మాదాపూర్ రోడ్డు గుండా సాగింది ఈ ప్రారంభ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు సుమలత, శ్రీనివాస్,సత్యవతి, సంధ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు.0/Post a Comment/Comments

Previous Post Next Post