నూతన రెవిన్యూ చట్టానికి ఆమోదం తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వనికి కృతజ్ఞతలు తెలుపుతూ భారీ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే రసమయి

 


కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ కేంద్రంలోని అలుగునూర్ చౌరస్తాలో ముందుగా అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి ర్యాలీని ప్రారంభించారు అనంతరం నూతన రెవిన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో 6 మండలాల్లోని రైతులు దాదాపు 2500 ట్రాక్టర్ల తో భారీ ర్యాలీ నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతభావాన్ని తెలిపారు.ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన రెవిన్యూ చట్టం అలాగే వీఆర్వో వ్యవస్థ రద్దుతో  రైతులు పడుతున్న కష్టాలకు సీఎం కెసిఆర్ చరమ గీతం పాడారని అన్నారు.ఇకపై సన్న చిన్నకారు రైతులకు సమస్యలు  తీరుతాయన్నారు.కెసిఆర్ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తు రైతులను రాజు చేయాలనే సంకల్పంతో పనీ చేస్తుందని అందుకే కొన్ని ప్రతిపక్ష పార్టీలకు మింగుడు పడడం లేదని అందుకే ప్రభుత్వంపై బురద జల్లే విదంగా వ్యవహరిస్తున్నారని అన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post