సచువాలయం తట్ట మట్టిని ఎత్తక ముందే దోపిడీకి తెరలేపారు: రేవంత్ రెడ్డి

 


జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ టీమ్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కదోవ పట్టించారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. పాత మ్యాపులను మాయం చేసి, కొత్త మ్యాప్ లతో బురిడీకొట్టిస్తున్నారని అన్నారు. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలోని బ్రిటీష్ ఆసుపత్రిలో అసలైన పాత మ్యాప్ ఉందని చెప్పారు.మూఢ నమ్మకాల వల్లే సచివాలయాన్ని అక్కడ ఉన్న గుడి, మసీదును కూల్చేశారని ఆరోపించారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీలతో కలిసి ఈ విధ్వంసానికి పాల్పడ్డారని అన్నారు. గుళ్లను కూల్చిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సచివాలయ నిర్మాణానికి అనుమతులు వచ్చాయని సునీల్ శర్మ ప్రకటించారని... ఇప్పటికే రూ. 400 కోట్ల నుంచి రూ. 700 కోట్లకు అంచనాలను పెంచేశారని చెప్పారు. తట్ట మట్టిని కూడా ఎత్తక ముందే దోపిడీకి తెరలేపారని అన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post