భారత రక్షణ పరిశోధన సంస్థ మరో విజయం .. ఏటీజీఎం పరీక్ష విజయవంతం

 


భారత రక్షణ పరిశోధన సంస్థ డీఆర్‌డీవో మరో విజయం సాధించింది. లేజర్‌ కిరణాల సాయంతో లక్ష్యాన్ని ఛేదించే ట్యాంకు విధ్వంసక క్షిపణిని (ఏటీజీఎం) నిన్న విజయవంతంగా పరీక్షించింది. నాలుగు కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఈ క్షిపణి పూర్తి కచ్చితత్వంతో తుత్తినియలు చేస్తుందని అధికారులు తెలిపారు.మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌లోని ఆర్మర్డ్ కార్ప్స్ సెంటర్ అండ్ స్కూల్ (ఏసీసీ అండ్ఎస్)లో డీఆర్‌డీవో ఈ పరీక్షను నిర్వహించినట్టు పేర్కొన్నారు. మూడో తరానికి చెందిన ఎంబీటీ అర్జున్ యుద్ధ ట్యాంకుపై నుంచి దీనిని ప్రయోగించినట్టు తెలిపారు. క్షిపణి పరీక్ష విజయవంతం కావడంపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్‌డీవోను అభినందించారు.


0/Post a Comment/Comments

Previous Post Next Post