తిమ్మాపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ కార్యకర్తల ధర్నా


 

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు  ఎల్ ఆర్ ఎస్ రద్దు కొరకు తిమ్మాపూర్ మండల  తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు  ధర్నా నిర్వహించారు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ ఆర్ ఎస్ పధకాన్ని ఉపసంహరించాలని బీజేపి కార్యకర్తలు డిమాండ్ చేశారు. పేద మధ్యతరగతి ప్రజలపై పడుతున్న ఆర్థికభారం పట్ల ప్రజలకి ఇబ్బందులు వస్తున్న క్రమంలో ఇట్టి పథకం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ధోరణి మార్చుకోవాలని వినతిపత్రం తహసీల్దార్ కి సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కోమల ఆంజనేయులు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల అధ్యక్షుడువ్  సుగుర్తి జగదేశ్వరచారి(జగన్),మండల ప్రధాన కార్యదర్శి గిట్టముక్కల తిరుపతి రెడ్డి, కె.అనిల్ కుమార్ ,ఉప అధ్యక్షుడు బి.వెంకటేష్, వి రవీందర్, బి.శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post