ఖాసీంపెట్ గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ చేసిన సర్పంచ్ గంప మల్లేశ్వరి


 

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసీంపెట్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం గ్రామ సర్పంచ్ గంప మల్లేశ్వరి వెంకన్న ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు బద్దం తిరుపతిరెడ్డి పాల్గొని మాట్లాడారు ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగ కానుకగా చీరలు అందిస్తుండంతో  ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు సర్పంచ్ గంప మల్లేశ్వరి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా తెలుగింటి ఆడపడుచులకు ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తుందని అన్నారు ఈకార్యక్రమంలో వార్డు సభ్యులు సందవేణి ఐలయ్య, బొజ్జ రేణుక, బుర్ర ఎల్లయ్య గౌడ్, రాగిటి వీరయ్య, కో ఆప్షన్ సభ్యులు వైకుంఠం గ్రామ ప్రజలు మహిళలు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post