రాష్ట్ర మాలమహానాడు ఉపాధ్యక్షుడుగా ఆవల ప్రసాద్ రావు  •  జిల్లా ఎస్పీ ఎస్టి అట్రాసిటి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సభ్యులుగా కొనసాగుతున్న ఆవల ప్రసాద్ రావు


  •   సుదీర్ఘ కాలంగా దళితల సమస్యలపై పోరాడుతున్న ఆవల


  •   రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్ రావు ఆదేశాలతో రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆవల ప్రసాద్ రావు


  •  ఆవల ప్రసాద్ రావుకు  దళిత బహుజన సంఘాల అభినందనలు


 ప్రముఖ దళిత  ఉద్యమ నాయకులు,పోరాట యోధుడు ,నిరంతర ప్రజా సేవకులు సూళ్లూరుపేట కు చెందిన జిల్లా ఎస్సి ఎస్టి అట్రాసిటి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఆవల ప్రసాద్ రావు రాష్ట్ర మాలమహనాడు ఉపాధ్యక్షుడు గా రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక చేసింది, శుక్రవారం కడపలో రాష్ట్ర మాల మహానాడు కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు, ఈ కమిటీలో నెల్లూరు జిల్లా నుండి సూళ్లూరుపేట కు చెందిన ఆవల ప్రసాద్ రావును రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ,నెల్లూరు కు చెందిన స్వర్ణ వెంకయ్య ను రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది, ఆవల ప్రసాద్ రావు సుదీర్ఘ కాలంగా  దళితులు సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారు, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసి పేద,బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు తోడ్పాటు అందించారు, చిన్న వయసులోనే సినీరంగంలో ప్రవేశం చేసి రాణించారు,ఆ తరువాత రైల్వే ఇంజినీరింగ్ ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు,ఆ తరువాత అంబేద్కర్ ఆశయా సాధన కోసం ఆయన చేస్తున్న పోరాటాలు స్ఫూర్తి దాయకంగా నిలిచే విధంగా పనిచేస్తున్నారు,సూళ్లూరుపేట లో అంబెడ్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడంలో ఆయన కృషి మరువలేనిది, ఆవల ప్రసాద్ రావు సేవలను గుర్తించి జిల్లా ఎస్సి ఎస్టి అట్రాసిటి కమిటీ సభ్యులు గా నియమించారు, వయస్సు దాటినా ఆయనలో ఉద్యమ స్ఫూర్తి రెట్టింపు అవుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు, చివరి శ్వాస వరకు దళితులకు అండగ నిలిచి వారి అభ్యున్నతికి దోహదపడాలని పరితపిస్తున్నారు, రాష్ట్ర ఉపా ధ్యక్షుడు ఏకగ్రీవంగా ఎన్నిక ఆయిన ఆవల ప్రసాద్ రావు ను జిల్లా దళిత బహుజన సంఘాల నేతలు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ సందర్భంగా ఆవల ప్రసాద్ రావు మాట్లాడుతూ మలమహా నాడు అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్ రావు తన పై నమ్మకం ఉంచి రాష్ట్ర మాల మహానాడు ఉపాధ్యక్షుడు గా ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం చాలా గర్వంగా ఉంది అనీ, ఆయన తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటు అహర్నిశలు మాలలు సంక్షేమం కోసం శ్రమిస్తాను అనీ ఆయన వెల్లడించారు,

0/Post a Comment/Comments

Previous Post Next Post