రైతులను ఆదుకోండి కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన అంబటి జోజిరెడ్డి

 


కరీంనగర్ జిల్లా: అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులకు వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన శుక్రవారం టీడీపీ ప్రతినిధుల బృందంతో కలిసి జిల్లా కలెక్టరు ఒకవినతిపత్రం సమర్పించారు. అంతేకాకుండా వర్షాలకు మొల వడ్లను, తెగుళ్ల బారిన పడ్డ ప్రభుత్వం సిఫారసు చేసిన తెలంగాణ సోన సన్న రకం పైరు కట్టలను కలెక్టర్‌కు చూపించారు. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో పంటలకు అపార నష్టం వాటిల్లిందని, చేతికి వచ్చే సమయంలో వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిని నేలపాలు కావడంతో రైతులు తల్లడిల్లిపోతున్నారన్నారు  వర్షాలకు పంటలు నేలరాలగా, కోసిన పంటలు తడిసి మొలకలెత్తాయని, తడిసిన ప్రతి గంజను ప్రభుత్వమే కొనుగోలు చేయడమే కాకుండా నష్టపరిహారం సత్వరం అందించి రైతులను ఆదుకోవాలని జోజిరెడ్డి కోరారు. ప్రభుత్వం సిఫారసుతో సన్నరకం తెలంగాణ సోనా ను సాగు చేసిన రైతులు తెగుళ్ల బారిన పడ్డారని, వర్షాలు, వాతావరణ పరిస్థితులకు తట్టుకోలేని ఈ రకం పైరుకు మాత్రమే తెగుళ్లు సోకడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ కాంటాలు ఏర్పాటు చేయడమే కాకుండా రైతులకు కంప్యూటరైజ్డ్ రశీదులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్ ను కలిసిన టీడీపీ ప్రతినిధుల బృందంలో అంబటి జోజిరెడ్డితోపాటు పార్టీ కరీంనగర్ నియోజ కవర్గ కో-ఆర్డినేటర్ కళ్యాడపు ఆగయ్య, నగర పార్టీ అధ్యక్షుడు వంచ శ్రీనివాస్ రెడ్డి, పార్టీ పార్లమెంట్ కమిటీ సభ్యుడు సందెబోయిన రాజేశం, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రొడ్డ శ్రీధర్, కార్యదర్శి బీరెడ్డి కరుణాకర్ రెడ్డి,టీఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్లపల్లి రవీందర్, టీఎస్ఎ్వ పార్లమెంట్ అధ్యక్షుడు ఎర్రవెల్లి రవీందర్ ఉన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post