గన్నేరువరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు - బహుమతులు అందజేసిన సిపి కమలాసన్ రెడ్డి

  


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో శనివారం అమరవీరుల వారోత్సవాలు భాగంగా ఎస్సై ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో మండల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కరీంనగర్ సిపి కమలహాసన్ రెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు మొదటి బహుమతి గన్నేరువరం కబడ్డీ అసోసియేషన్ కు ఐదు వేల రూపాయలు మెమొంటో అందజేశారు రెండో బహుమతి హనుమాజి పల్లి మూడు వేల రూపాయలు  మెమొంటో అందజేశారు అనంతరం కరోనా నేపథ్యంలో పోలీస్ శాఖ కు సహకరించిన పోలీస్ వాలింటర్ లకు సర్టిఫికెట్లు సిపి కమలాసన్ రెడ్డి, ఎస్సై ఆవుల తిరుపతి, ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి అందజేశారు,జిల్లా పోలీస్ శాఖ అధ్వర్యంలో కళాబృందం చే రాచకొండ తిరుపతి గౌడ్ పాటలతో  ప్రజలను ఆకట్టుకున్నాడు ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి,జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, సర్పంచ్ పుల్లెల లక్ష్మి లక్ష్మణ్, వైస్ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్,ఎంపీటీసీ బొడ్డు పుష్పలత చంద్రమోహన్, ఎమ్మార్వో బండి రాజేశ్వరి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి  జువ్వాడి మన్మోహన్ రావు,ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బద్దం తిరుపతిరెడ్డి,నాయకులు గంప వెంకన్న,గొల్ల పెళ్లి రవి, బొడ్డు సునీల్, టిఆర్ఎస్ మానకొండూర్ నియోజకవర్గ యువజన సంఘం అధ్యక్షుడు గూడూరి సురేష్, కబడ్డీ పిటి బుర్ర మల్లేశం గౌడ్, వార్డు సభ్యులు బుర్ర జనార్దన్ గౌడ్, గ్రామ ప్రజలు క్రీడాకారులు, పోలీస్ సిబ్బంది యువకులు తదితరులు పాల్గొన్నారు


0/Post a Comment/Comments

Previous Post Next Post