రాజపల్లిలో దెబ్బతిన్న పంటలు పరిశీలించిన అంబటి

 


కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రాజపల్లి గ్రామంలో అకాల వర్షాలకు  నేలకొరిగిన వరి పంటలను తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి గురువారం పరిశీలించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ   ప్రభుత్వం చెప్పిన సన్న రకం వారి విత్తనాలతో సాగు చేస్తున్న  పైర్లకు తెవుళ్ళు సోకడంతో రైతులు లబోదిబోమంటున్నారన్నారు. తెలంగాణ సోనా, ఆర్ ఎన్ ఆర్ వంటి రకాలకు విపరీతమైన తెగులు సోకి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఎకరాకు ఒక బస్తా మాత్రమే దిగుబడి వస్తుందని,అదే దొడ్డు రకం సాగు చేసుకుంటే దిగుబడి ఎక్కువగా ఉండేదన్నారు.   అకాల వర్షాలు, తెగుళ్ల వల్ల అసలే నష్టపోయి ఉన్న రైతులు నిర్బంధ సాగు తో పీకలలోతు నష్టాల్లో కూరుకుపోతారని అందోళన వ్యక్తం చేశారు.   రైతులకు పెట్టుబడి కి ఎకరాకు 50 వేల రూపాయలు ఖర్చు అయ్యిందని, నష్టపోయిన రైతులకు ఎకరా కి 50 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈకార్యక్రమంలో తెలుగురైతు రాష్ట్ర కార్యదర్శి ముచ్చ సమ్మిరెడ్డి,టీ. ఎన్.ఎస్.ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పర్లపల్లి రవీందర్,టీడీపీ పట్టణ అధ్యక్షులు రామగిరి అంకూస్,టీ. ఎన్.ఎస్ ఎఫ్ అధ్యక్షులు టేకుల శ్రావణ్,తెలుగుయువత రాష్ట్ర కార్యదర్శులు బీరెడ్డి కరుణాకర్ రెడ్డి,బత్తిని సతీష్ గౌడ్,ఇల్లందుల రమేష్ తదితరులు ఉన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post