సీనియర్ ఐపీఎస్ అధికారి రవీంద్రనాథ్... ఉద్యోగానికి రాజీనామా

 


తనకు అన్యాయం చేశారంటూ కర్ణాటకలోని సీనియర్ ఐపీఎస్ అధికారి రవీంద్రనాథ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన అటవీశాఖ అడిషనల్ డీజీపీగా ఉన్నారు. బుధవారం జరిగిన ఐపీఎస్ అధికారుల పదోన్నతుల్లో తనకు తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకంటే జూనియర్లు అయిన అధికారులకు ప్రమోషన్లు ఇవ్వడం తనను బాధించిందని చెప్పారు.ఈరోజు పోలీస్ కంట్రోల్ రూమ్ కు వెళ్లిన ఆయన తన రాజీనామా లేఖను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను ఎవరు టార్గెట్ చేస్తున్నారో చెప్పలేనని అన్నారు. పోలీస్ శాఖలో టార్గెట్ చేయడం, వేధించడం సాధారణ విషయమే అయినప్పటికీ... ఇప్పుడు రాజీనామా చేయడమే సరైన నిర్ణయమని తాను భావించానని చెప్పారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post