గన్నేరువరం ఉన్నత పాఠశాలను సందర్శించిన డిఈఓ జనార్దన్ రావు

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: విద్యార్థులు కరోనా  నేపథ్యంలో నిర్వహించ బడుతున్న ఆన్లైన్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని అందుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సిహెచ్.వి జనార్దన్ రావు పేర్కొన్నారు గురువారం మధ్యాహ్నం గన్నేరువరం ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు ఆన్లైన్ తరగతులకు సంబంధించి ఉపాధ్యాయుల దత్తతగా వివరాలు మార్కులు రిజిస్టర్లు 6 వారాలకు సంబంధించి సబ్జెక్టులు వారిగా గ్రేడ్లు పరిశీలించారు విద్యార్థులకు అందిస్తున్న వర్క్ షీట్ లు స్లిప్ లిస్టులో పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు గత రెండు సంవత్సరాలు రిజల్ట్ తో తో పిల్లల గ్రేడ్ లను పరిశీలించి తగు సూచనలు చేశారు డి మరియు ఈ కేటగిరీ విద్యార్థులు అభ్యసన సామర్థ్యం పెంపొందించడానికి ప్రత్యేక ప్రణాళిక చేపట్టాలన్నారు ఆన్లైన్ క్లాసులు విజయవంతం అయ్యేలా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కృషిచేయాలని తల్లిదండ్రులు అనువైన పరిస్థితులు ఇంటివద్ద పిల్లలను కల్పించాలని వారు తెలియజేశారు ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు  పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post