స్వగ్రామానికి చేరుకున్న శ్రీనివాస్ మృతదేహం - భారీ పోలీసుల మధ్య అంత్యక్రియలు


 

ఉమ్మడి కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం బేగంపేట గ్రామానికి చెందిన రంగవేణి శ్రీనివాస్ బెజ్జంకి ఎస్ఐ చంద్రశేఖర్ కొట్టిన దెబ్బలకు మృతి చెందాడని సోమవారం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు భారీ ఎత్తున  మోహరించారు అటోఇటో  మొత్తానికి అయితే పోస్టుమార్టం చేసుకుని మృతదేహం సోమవారం స్వగ్రామానికి తీసుకువచ్చారు అయితే బేగంపేట్ గ్రామంలో భారీ బందోబస్తు మధ్య శ్రీనివాస్ అంత్యక్రియలు పూర్తి చేశారు ఈ ఘటనకు సంబంధించి తీవ్రంగా నాయకులు ఖండించారు ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా అంటూ ఐదురోజులు చావు బతుకుల మధ్య ఆఖరికి ఆదివారం రోజు రాత్రి శ్రీనివాస్ మృతిచెందడంతో బేగంపేట గ్రామమంతా శోకసముద్రంలో మునిగిపోయారు వెంటనే ఎస్ఐ చంద్రశేఖర్ ను సస్పెండ్ చేయాలని  కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జిల్లా నాయకులు పోతిరెడ్డి శేఖర్ మీడియాతో మాట్లాడారు , బిఎస్పి మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జి నిషాని రామచంద్రం మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీస్ అంటే బాధితుడు తప్పుచేస్తే కోర్టులో పెట్టి శిక్షించడం తప్ప కొట్టే హక్కు పోలీస్ లేదని ఈరోజు జరిగిన  సంఘటన బాధాకరమైన విషయం మరి ఈ శ్రీనివాస్ కుటుంబాన్ని పోలీసుశాఖ తరపున మరియు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని శ్రీనివాస్ పిల్లలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు

0/Post a Comment/Comments

Previous Post Next Post