గన్నవరం వైసీపీలో ఆధిపత్య పోరు - రాళ్లు రువ్వుకున్న వల్లభనేని వంశీ, దుట్టా వర్గీయులు

 


గన్నవరం నియోజకవర్గంలో వైసీపీలో ఆధిపత్య పోరు తార స్థాయికి చేరింది. కొన్ని నెలల క్రితం వల్లభనేని వంశీ వైసీపీ గూటికి చేరినప్పటి నుంచి ఆ పార్టీలో వివాదం ప్రారంభమైంది. ఓ వైపు వంశీ, మరోవైపు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు మీడియా ముఖంగా విమర్శలు చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వైసీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన వంశీ... ఇప్పుడు పార్టీలో ఆధిపత్యం చూపించేందుకు యత్నిస్తున్నాడని వారు మండి పడుతున్నారు. తాజాగా నియోజకవర్గంలో విభేదాలు ఈరోజు మరోసారి బయటపడ్డాయి. బాపులపాడు మండలం కాకులపాడులో రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన సందర్భంగా వివాదం నెలకొంది. వంశీ, దుట్టా ఎదుటే ఇరు వర్గీయులు ఘర్షణకు దిగారు. వివాదం ముదిరి, రాళ్లు రువ్వుకునే స్థాయికి వెళ్లింది. ఈ ఘర్షణలో కొందరు గాయపడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.  


0/Post a Comment/Comments

Previous Post Next Post