మమ్మల్ని ఇబ్బంది పెడితే మీ ఇండ్లను ముట్టడిస్తాం బిజెపి మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి

 


కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెడితే మీమీ ఇండ్లను ముట్టడిస్తామని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల బిజెపి అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి టీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు దుబ్బాక ఎన్నికల్లో భాగంగా బిజెపి నాయకులపై జరిగే పోలీసుల వేధింపుల విషయంలో పరామర్శకు వెళ్తున్న బండి సంజయ్ పై సిద్దిపేట పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మంగళవారం నుస్తులాపూర్ రాజీవ్ రహదారి పై రాస్తారోఖో నిర్వహించారు. హైదరాబాద్-కరీంనగర్ వైపు ఇరవై నిముషాలపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి ఎల్ఎండి ఎస్ఐ వై కృష్ణారెడ్డి బందొబస్తు నిర్వహించారు ఈ సందర్బంగా మండల అధ్యక్షులు జగదీశ్వరాచారి మాట్లాడుతూ దుబ్బాక ఎన్నికల్లో పోలీసులను అడ్డుపెట్టుకొని అరాచకాలను సృష్టిస్తున్న హరీష్ రావుకు దుబ్బాక గెలుపు గుణపాఠం చెబుతుందని అన్నారు.కేసీఆర్ మెప్పుకోసం తిప్పలుపడుతున్న హరీష్ రావు,పోలీసు వ్యవస్థను అభాసుపాలు చేస్తున్నారని ఆరోపించారు.ఎన్నికల్లో ఇబ్బంది పడుతున్న బిజెపి నాయకులను పరామర్శించేందుకు వెళ్తున్న సంజయ్ పై దౌర్జన్యం చేసిన సీపీ జోయల్ డేవిస్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.బీసీ నాయకుడు సంజయ్ పై హరీష్ రావు దొర అహంకారం చూపిస్తున్నాడని ఆరోపించారు.ఈకార్యక్రమంలో కిసాన్ మోర్చా కౌన్సిల్ మెంబర్ తమ్మిశెట్టి మల్లయ్య,ప్రధాన కార్యదర్శి కిన్నెర అనీల్ కుమార్,ఉపాధ్యక్షులు తమ్మనవేణి రాజు యాదవ్, పబ్బ తిరుపతి, బిజెవైఎం, ఒబీసీ మండల శాఖ అధ్యక్షులు గడ్డం అరుణ్,దుర్సేటి రమేష్, సీనియర్ నాయకులు కొయ్యడ శ్రీనివాస్,ఎర్రోజు లక్ష్మణ్, వేల్పుల శ్రీనివాస్ యాదవ్, గుండోజు సంపత్,కేతిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, రేగూరి సుగుణాకర్,బుర్ర శ్రీనివాస్, గాండ్ల రాము,నేరెళ్ల శ్రీనివాస్, సోషల్ మీడియా కన్వీనర్ ఐల రాజశేఖర్,దొనపాటి ప్రదీప్ రెడ్డి,బొడ్డు అశోక్,విక్రమ్, ఆవుల వేణు తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post