నాయిని మృతి పట్ల ప్రముఖుల సంతాపం.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

 


మాజీ  హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో, ప్రభుత్వంలో కలిసి పని చేసిన అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.నాయిని మృతి పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం, రైల్వే కోర్టు చుట్టూ తిరగడం, ఎన్నికల ప్రచారం, మంత్రులుగా ఆయనతో కలిసి పని చేసిన రోజులను గుర్తు చేసుకుంటూ ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ‘నర్సన్నను మిస్ అవుతున్నా’మని పేర్కొన్నారు.  నాయిని మృతి పట్ల టీడీపీ నేత నారా లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. ‘ప్రజల కోసం, కార్మికుల కోసం ఎన్నో ఉద్యమాలలో పాల్గొని యువనాయకుల్లో స్ఫూర్తిని నింపిన మాజీ మంత్రి, సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డిగారి మరణం విచారకరం. ఒక నిబద్ధత కలిగిన నాయకుడిని తెలుగువారు కోల్పోయారు. నర్సింహారెడ్డిగారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని ఆయన ట్వీట్ చేశారు.  

0/Post a Comment/Comments

Previous Post Next Post