కరీంనగర్ - వరంగల్ రోడ్డు మరమ్మత్తులు చేయించాలి ఎంపీ బండికి టీఎన్ ఎస్ఎఫ్ వినతి

 


కరీంనగర్-వరంగల్ జాతీయ ప్రధాన  రహదారి (NH563 )రోడ్డు మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కి టీఎన్ఎస్ ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షుదు టేకుల శ్రావణ్ , తెలుగుయువత రాష్ట్ర కార్యదర్శి బత్తిని సతీష్ లు వినతి పత్రం సమర్పించారు. హుజురాబాద్ కి విచ్చేసిన సందర్బంగా ఆయనకు  వినతిపత్రం అందజేశారు. కరీంనగర్ నుండి వరంగల్ వరకు రాకపోకలు కొనసాగించే ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారని,ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల రోడ్డు పూర్తిగా దెబ్బతిందని రోడ్డు సరిగ్గా లేని కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, నిత్యం వందలాది గ్రానైట్ లారీలు వెళ్లడం వల్ల తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టినా ఉపయోగం లేదని,వెంటనే దృష్టి సారించి కేంద్ర నిధుల సహాయంతో రోడ్డు పనులు ప్రారంభించడంతో పాటు తాత్కాలిక మరమ్మతులు చేపట్టేలా  చూడాలని  కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పెండ్యాల రాజేష్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post