రాజ్యసభ, లోక్ సభలను కలిపినా 100 మంది లేరు : కాంగ్రెస్ పై మోదీ సెటైర్లు

 


బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులోని రాజ్యసభ, లోక్ సభలను కలిపినా కాంగ్రెస్ కు 100 మంది ఎంపీలు లేరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం అంత ఘోరంగా ఉందని అన్నారు. ఏ విషయంపై చర్చించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని... అందుకే ఆ పార్టీ పార్లమెంటులో 100 కంటే దిగువకు పడిపోయిందని చెప్పారు.నిన్న తొమ్మిది మంది బీజేపీ అభ్యర్థులు ఎలాంటి పోటీ లేకుండానే రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో పెద్దల సభలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే సభ్యుల సంఖ్య ప్రస్తుతం 112 . మరోవైపు దేశంలోని 14 ప్రధాన రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎంపీ కూడా లేకపోవడం గమనార్హం. దేశ రాజకీయాలలో చక్రం తిప్పే ఉత్తరప్రదేశ్ నుంచి కూడా కాంగ్రెస్ కు ఒకే ఒక ఎంపీ ఉన్నారు. వారు ఎవరో కాదు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.

0/Post a Comment/Comments

Previous Post Next Post