బీహార్ లో ఎన్డీఏ విజయంపై ఆరోపణలు...ప్రతిపక్షాల ఆరోపణలను కొట్టేసిన ఈసీ

 


ఎగ్జిట్  పోల్స్ లో మహాకూటమి విజయం సాధిస్తుందని అంచనాలు వెల్లడైనప్పటికీ బీహార్‌లో ఎన్డీఏ విజయం సాధించిన నేపథ్యంలో  పలు సందేహాలు తలెత్తుతున్నాయి.ఓట్ల కౌంటింగ్‌పై పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల అధికారులపై బీహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్ తో పాటు డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ మోదీ ఒత్తిడి తీసుకొచ్చి ఫలితాలను తమకు అనుకూలంగా మార్చేశారని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ ఆరోపణలు చేశారు.19 మంది అభ్యర్థులంతా గెలుస్తున్నట్టు ఈసీ‌ వెబ్‌సైట్‌లోనూ పెట్టారని, అంతలోనే కనీసం 10 మంది అభ్యర్థులు ఓడినట్టు ప్రకటించారని అన్నారు. నిజానికి తమ కూటమి 119 స్థానాల్లో గెలిచిందని నిన్న రాత్రి ఆ జాబితాను ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ కూడా ఎన్నికల అధికారులపై ఆరోపణలు చేయడం గమనార్హం.గెలిచిన తమ కూటమి అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదని తెలిపింది. దీనిపై ఎన్నికల సంఘం స్పందించింది.  10 మంది అభ్యర్థులు ఓడినట్టు ప్రకటించారన్న తేజస్వీ ఆరోపణలపై ఉమేశ్‌ సిన్హా మాట్లాడుతూ...  ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోని రిటర్నింగ్‌ అధికారుల నుంచి సమాచారం రావడానికి ఆలస్యం అవుతుందని చెప్పారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post