జర్నలిస్ట్ నాగరాజు ను చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి-టిడబ్ల్యుజెడబ్ల్యూఎస్ అధ్యక్షులు పూనెం ప్రదీప్ కుమార్

 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి రాజు కోల ఆధ్వర్యంలో సోమవారం భద్రాచలంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యుజెడబ్ల్యుఎస్ రాష్ట్ర అధ్యక్షులు పునెం ప్రదీప్ కుమార్  మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమం, భద్రత కోసం ఎన్ని చట్టాలు చేసినా కొంత మంది అక్రమార్కులు జర్నలిస్టులపై దాడులు చేస్తూ హత్యలు చేస్తుండటం బాధాకరమని ఆయన అన్నారు. జర్నలిస్టులు వృత్తి నిర్వహణలో భాగంగా అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెస్తే అది నచ్చని కొంతమంది దాడులు చేయడాన్ని సహించరాని నేరంగా పరిగణించాలని ఆయన అన్నారు. తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లా హోసూరులో 52 సంవత్సరాల నాగరాజు అనే జర్నలిస్ట్ తమిళ దినపత్రిక లో పనిచేస్తూ ఆదివారం హత్యకు గురవడం బాధాకరమన్నారు. ఉదయం ఇంటి వద్దనే గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు వేటకొడవళ్లతో దాడి చేసి హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. నాగరాజుని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో జర్నలిస్టులపై దాడి, హత్య చేసిన, బెదిరించిన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పని చేసి, ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చి పరిష్కరించేలా కృషి చేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి భద్రతకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సత్యం కాట. గుమ్మడపు దుర్గాప్రసాద్. దండుగుల రవి కుమార్. గుందెబోయిన వెంకటేశ్వర్లు. తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post