ఆదివాసీలపై దేశద్రోహం కేసు నమోదు

 


భారత దేశం లో ఆదివాసీలపై తొలిసారిగా యూఏపీఏ (సంఘ వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం) కింద కేసు నమోదైంది. పోలీసులు నిర్వహిస్తున్న ఆపరేషన్ మంగీలో కీలక సమాచారం లభ్యమైంది. ఈ సమాచారం ఆధారంగా ఆదివాసీలపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. మావోయిస్టులకు సహకరిస్తున్నారంటూ వారిపై ఆరోపణలు మోపారు. తాడ్వాయి వద్ద మావోయిస్టు అగ్రనేతను కలిశారంటూ ఐదుగురు ఆదివాసీలపై కేసు నమోదు కాగా, ఇతర అంశాల్లో మరో 12 మందిపై కేసులు నమోదయ్యాయి.ఆదివాసీలపై ఇప్పటివరకు యూఏపీఏ కింద దేశంలో ఎక్కడా కేసులు నమోదు కాలేదు. అయితే మావోయిస్టులకు ఆదివాసీలు సహకరిస్తున్నారని భద్రతా బలగాలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నాయి. తాజాగా నిర్వహించిన ఆపరేషన్ మంగీతో కీలక ఆధారాలు సంపాదించినట్టు తెలుస్తోంది.కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా మంగీ అడవుల్లో గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్టు అగ్రనేత భాస్కర్ లక్ష్యంగా గత 7 నెలలుగా అడవిని జల్లెడ పడుతున్నాయి. ప్రాణహిత మీదుగా మంగీ అడవుల్లోకి భాస్కర్ దళం ప్రవేశించినట్టు భద్రతా బలగాలు నిర్ధారించుకున్నాయి. మంగీ అడవుల్లో భాస్కర్ కు చెందిన డైరీ పోలీసులకు లభించినట్టు తెలుస్తోంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post