మరో భారత్ మిసైల్ సక్సెస్

 


కొంతకాలంగా భారత్ క్రమం తప్పకుండా క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తోంది. వాటిలో ఖండాంతర క్షిపణుల నుంచి షార్ట్ రేంజి క్షిపణుల వరకు ఉన్నాయి. తాజాగా డీఆర్డీఓ వర్గాలు క్యూఆర్ సామ్ మిస్సైల్ ను విజయవంతంగా పరీక్షించాయి. ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ లక్ష్యం దిశగా దూసుకెళుతుంది. క్యూఆర్ సామ్ అంటే క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ (క్యూఆర్ఎస్ఏఎమ్).తాజాగా ఒడిశా లోని చాందీపూర్ టెస్టింగ్ రేంజి నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. పైలట్ రహిత బన్షీ విమానాన్ని లక్ష్యంగా నిర్దేశించగా, ఆ విమానాన్ని క్యూఆర్ సామ్ మిస్సైల్ గురితప్పకుండా తాకింది. మీడియం రేంజి, మీడియం ఆల్టిట్యూడ్ లో ఈ పరీక్ష చేపట్టారు. యుద్ధ రంగంలో శత్రు విమానాలను కూల్చగల సత్తా ఉన్న ఈ క్షిపణి పరిధి 30 కిలోమీటర్లు.

0/Post a Comment/Comments

Previous Post Next Post