పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను కూల్చేయాలన్న అక్బర్ ... ఖండించిన కేటీఆర్

 


హుసేన్  సాగర్ పై పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ ఘాట్లను కూల్చేయాలంటూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. పార్టీలకు అతీతంగా అక్బర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.'ఈ ఇరువురు నాయకులు కూడా తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులు. ఒకరు ప్రధానిగా, మరొకరు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారు. అటువంటి మహానాయకులపై అనుచిత వ్యాఖ్యలు గర్హనీయం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలకు చోటులేదు. మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గార్లపై ఈ రోజు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన అనుచితమైన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాను' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.మరోవైపు ఈ రోజు జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ, జీహెచ్ఎంసీ ఎన్నికలు గల్లీ ఎన్నికలు అనే విషయాన్ని బీజేపీ నేతలు మరిచిపోయారని కేటీఆర్ అన్నారు. గల్లీ ఎన్నికల కోసం ఢిల్లీ నేతలను రప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ వాళ్లకు స్నేహితుడైన డొనాల్డ్ ట్రంప్ ను కూడా రప్పిస్తారేమోనని సెటైర్ వేశారు. తమకు ప్రజల ఆశీర్వాదాలు ఉంటే చాలని చెప్పారు.


https://twitter.com/KTRTRS/status/1331539434685169664

0/Post a Comment/Comments

Previous Post Next Post