నిరుపేద కుటుంబ జవాన్ ని ఆదుకున్న జయహో జనతా సర్వింగ్ సోల్జర్స్

 


జగిత్యాల  రాయికల్ :కట్కాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద జవాన్ తల్లి  నాన్నపురాజు  కళావతి క్యాన్సర్ తో మృతి చెందారు . వివరాల్లోకి వెళితే  దామోదర్ రాజు లాక్ డౌన్  కి ముందే ఆర్మీ ట్రైనింగ్ పూర్తి చేసుకొని  విధుల్లో చేరాడు .   తల్లి ఆరోగ్యం బాగాలేక ఇబ్బందులు పడుతుండగా లాక్ డౌన్ వలన ఆసుపత్రికి తీసుకెళ్లడం కుదరలేదు,  ఆగష్టు నెలలో  లో హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళగా అక్కడ వైద్యులు  బ్లడ్ కాన్సర్ చెప్పారు. సెలవు మీద వచ్చిన జవాన్ తల్లి కోసం అప్పులు చేసి చివరకి బసవతారకం ఆసుపత్రిలో చేర్పించాడు . కానీ తల్లి మృత్యుతో పోరాడి అక్టోబర్ నెలలో మరణించారు . 


ఈ విషయం తెలిసిన ఉమ్మడి కరీంనగర్ జైయహో జనతా - జవాన్ లు తక్షణ సహాయార్థం   40,000 పోగు చేసి అందించారు . దామోదర్ రాజ్ ఆర్మీ జవాన్ వారం తరువాత విధుల లో చేరాలి . తల్లి వైద్యం కోసం అప్పులు చేసి ఇబ్బంది పడుతున్న జవాన్ కుటుంబానికి దాతలు ఎవరైనా ముందుకు రావాలని సర్వింగ్ సోల్జర్స్ కోరుతున్నారు . 


ఈ కార్యక్రమం లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జై హోజనతా - జవాన్ లు (నవీన్ కుమార్-జగిత్యాల) 

(కిషోర్ - కోరుట్ల)  (మల్లేశం - చొప్పదండి)  (రాకేష్  - చొప్పదండి ) (మహేష్ -రంగంపేట ) 

(నవీన్ - గుమ్లాపూర్ )  (రవీందర్ - అప్పన్నపేట ) (శ్రీనాథ్ - చిగురుమామిడి ) పాల్గొన్నారు.
0/Post a Comment/Comments

Previous Post Next Post