చలో ప్రగతి భవన్ మౌన దీక్ష : రైతు ఐక్య వేదిక  •  సన్నరకం ధాన్యానికి రూ.2500 లు ధర ప్రకటించాలని డిమాండ్ తో ఈ నెల 12న రైతు చేపట్టనున్న చలో ప్రగతి భవన్ మౌన దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని
  •  రైతు ఐక్య వేదిక ప్రతినిధులు పిలుపునిచ్చారు. కరీంనగర్ లో మంగళవారం  రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో  మౌనదీక్ష 

కార్యక్రమం సన్నాహక సమావేశాన్ని వేదిక ప్రతినిధులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్ సాగుకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులతో నిర్బంధ సాగు విధానంలో తప్పనిసరిగా సన్నరకం వడ్లు పెట్టాలని, లేదంటే రైతు బంధు ఇవ్వమని, ధాన్యం కొనుగోలు చేయమని బెదరించారని ఆరోపించారు. దీంతో మాములుగా దొడ్డు రకం వడ్లు సాగుచేస్తే ఎక్కువ దిగుబడి వచ్చేదని, సన్నరకం సాగు చేయడం తో దాదాపు10 క్వింటాళ్ల వరకు దిగుబడి తగ్గిందని, తెగుళ్లు కూడా ఎక్కువగా ఉండటంతో పెట్టుబడి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సన్న రకాలు సాగు చేయమన్న కేసీఆర్ వెంటనే బోనస్ తో కలిపి రూ.2500 లు పెంచుతున్నట్లు ప్రకటించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముందు రైతులతో మౌన దీక్ష చేపట్టి నిరసన వ్యక్తం చేస్తామన్నారు. ఈ నెల 12న  ప్రగతి భవన్ ముందు చేపట్టే మౌన దీక్ష కు ముందే పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా రైతులు పెద్దఎత్తున తరలివచ్చి మౌన దీక్ష  విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో రైతు ఐక్య వేదిక ప్రతినిధులు భూంపల్లి రాఘవ రెడ్డి, అంబటి జోజిరెడ్డి, బేతి మహేందర్ రెడ్డి, వర్ణ వెంకట్ రెడ్డి, సంది తిరుపతి రెడ్డి, పెండ్యాల రాంరెడ్డి, లింగంపల్లి శంకర్, రేకులపల్లి రవీందర్, బారాజు కేశవరెడ్డి, సామ బాల్ రెడ్డి, రావుల కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post