రాష్ట్రపతికి ఎపి సియం జగన్ ఘన స్వాగత !

 


తిరుమల పర్యటన నిమిత్తం ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ లోని రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, పలువురు మంత్రులు కూడా కోవింద్ కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.ఆపై ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గాన తిరుచానూరుకు వెళ్లనున్న రాష్ట్రపతి దంపతులు, పద్మావతి అమ్మవారిని దర్శించుకుని, అక్కడి నుంచి మధ్యాహ్నానికి తిరుమలకు వెళ్లనున్నారు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని స్వామివారిని దర్శించుకున్న అనంతరం, సాయంత్రం తిరిగి రేణిగుంట చేరుకుని ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ కు బయలుదేరి వెళతారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post