రైతుల సమస్యలను పరిష్కరించాలని గుండ్లపల్లి రాజీవ్ రహదారిపై బీజేపీ నాయకులు రాస్తారోకో కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి రాజీవ్ రహదారిపై సోమవారం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా  కార్యదర్శి  రంగు భాస్కరాచారి హాజరయ్యారు ఆయనకు  బిజెపి మండల నాయకులు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు ఆయన మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు అకాల వర్షాలకు పంట నీట మునిగిన రైతులకు న్యాయం చేయాలని మరియు సన్న వడ్ల కు 2500 వందల రూపాయలు ప్రభుత్వం ప్రకటించాలని అలాగే ఎలాంటి తాలు  మరియు  కటింగ్ లేకుండా వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు, ఈకార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు నగునూరి శంకర్,రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ,జిల్లా నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, ముత్యాల జగన్ రెడ్డి, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కాంతల శ్రీనివాస్ రెడ్డి,బీజేవైఎం మండల అధ్యక్షుడు కూన మహేష్, మండల నాయకులు హరి కాంతం అనిల్ రెడ్డి, మునిగంటి సత్తయ్య ,బీజేపీ కార్యకర్తల మండలంలోని రైతులు తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post