మీడియా కవరేజి కోసమే ఈ డ్రామాలు ఆడుతున్నారు - టీడీపీ అధినేతపై సీఎం జగన్ వ్యాఖ్యలు


 

ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ మాట్లాడుతూ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు ఓ డ్రామా నాయుడు అని అభివర్ణించారు. 'సీబీఎన్' అంటే 'కరోనాకు భయపడే నాయుడు' అంటూ ఎద్దేవా చేశారు. కరోనాకు భయపడి హైదరాబాదులోనే కూర్చున్న చంద్రబాబు అసెంబ్లీలో మాత్రం మీడియా కవరేజి కోసం నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.రైతులకు ప్రభుత్వం చేసిన మేలును పక్కదోవ పట్టించేందుకే అసెంబ్లీలో చంద్రబాబు డ్రామాకు తెరలేపారని అన్నారు. చంద్రబాబు ఓ యాక్టర్ అని, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 మీడియా సంస్థల దర్శకత్వంలో నటిస్తున్నాడంటూ వ్యాఖ్యానించారు. నివర్ తుపానుతో రైతులు తీవ్రంగా నష్టపోతే ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పరామర్శించలేదని సీఎం జగన్ ఆరోపించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post