TELANGANA

గన్నేరువరం మండలంలో కలెక్టర్ శశాంక పర్యటన

 

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని యాస్వాడ, గన్నేరువరం , మైలారం గ్రామాలలో బుధవారం కలెక్టర్ శశాంక పర్యటించారు యాస్వాడ గ్రామంలో స్మశాన వాటిక ను పరిశీలించారు అనంతరం గన్నేరువరం గ్రామంలో పకృతి వనాన్ని కలెక్టర్ శశాంక సందర్శించి సర్పంచ్ పుల్లెల లక్ష్మి, ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు అధికారులు కలిసి పండ్ల మొక్కలు నాటారు అనంతరం కలెక్టర్ శశాంక సర్పంచ్ పుల్లెల లక్ష్మి ని అభినందించారు గన్నేరువరం గ్రామంలో పకృతి వనాన్ని మండలంలోనే ఆదర్శంగా నిలుపుతామని సర్పంచ్ పుల్లెల లక్ష్మి అన్నారు అనంతరం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ శశాంక సందర్శించి  అకాల వర్షాలకు రూములు దెబ్బతినడంతో రెవెన్యూ కార్యాలయంలో ఉండే పుస్తకాలు పాడ్ అవుతున్నాయని ఎమ్మార్వో బండి రాజేశ్వరి తెలిపింది వెంటనే తాసిల్దార్ కార్యాలయం కోసం నూతన భవనం కోసం ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు కలెక్టర్ శశాంక ఎమ్మార్వో బండి రాజేశ్వరి తో కలిసి రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు అనంతరం మైలారం గ్రామంలో కంపోస్ట్ షెడ్డు పరిశీలించారు, ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గూడెల్లి తిరుపతి, నుస్తులాపూర్ సహకార సంఘం చైర్మన్ అల్వాల కోటి, ఏడి వెంకటేశ్వర్లు, ఎంపీడీవో స్వాతి, మైలారం సర్పంచ్ దొడ్డు రేణుక మల్లేశం,యాస్వాడ సర్పంచ్ మధుకర్,టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు పుల్లెల లక్ష్మణ్, న్యాత సుధాకర్,కాంతల కిషన్ రెడ్డి, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు