గ్రేటర్ ఎన్నికలు: పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ 31 , బీజేపీ 82 సీట్లలో ఆధిక్యం


 

హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కు జరిగిన ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఫలితాల ట్రెండ్స్ విడుదలవుతున్నాయి. మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు జరుగగా, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఈ ఉదయం మొదలైంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్రెండ్స్ ప్రకారం, భారతీయ జనతా పార్టీ 82 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, టీఆర్ఎస్ 31 స్థానాల్లో, ఎంఐఎం 16, కాంగ్రెస్ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఎంఐఎంకు గట్టి పట్టున్న పాతబస్తీలో సైతం పోస్టల్ బ్యాలెట్ లో పలు చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉండటంతో ఫలితాల సరళిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post