ముగిసిన జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు ....టీఆర్ఎస్ కు 56 డివిజన్లలో విజయం


 

గ్రేటర్ హైదరాబాద్  ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. మొత్తం 150 డివిజన్లకు గాను ఎన్నికలు నిర్వహించగా, నేడు ఓట్లు లెక్కించారు. అధికార టీఆర్ఎస్ 56 డివిజన్లలో విజయం సాధించడం ద్వారా అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2016 ఎన్నికలతో పోల్చితే టీఆర్ఎస్ కు ఇవి చేదు ఫలితాలు. టీఆర్ఎస్ కు గట్టిపోటీ ఇచ్చిన బీజేపీ 48 డివిజన్లు కైవసం చేసుకోవడం ఈసారి ఎన్నికల్లో హైలైట్ అని చెప్పవచ్చు. ఎప్పట్లాగే ఎంఐఎం తన హవా చాటుకుంటూ 44 డివిజన్లలో జయకేతనం ఎగురవేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతిన్నది. హస్తం పార్టీకి కేవలం 2 డివిజన్లలో తప్ప ప్రతిచోటా నిరాదరణే ఎదురైంది.అసలు విషయానికొస్తే... జీహెచ్ఎంసీలో ఈసారి హంగ్ తప్పదని తేలిపోయింది. మేయర్ పదవిని కైవసం చేసుకునేందుకు మ్యాజిక్ ఫిగర్ 76 సీట్లు కాగా, ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ఆ మార్కు చేరుకోలేకపోయింది. దాంతో మేయర్ పదవి కోసం ఎంఐఎం మద్దతు కీలకం కానుంది. బీజేపీ... ఎంఐఎం మద్దతు కోరే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, ఎంఐఎం కలుస్తాయా అన్నదానిపై ఆసక్తి నెలకొంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post