అక్రమ మట్టి తవ్వకాలకు చెక్ పెట్టిన పిడుగురాళ్ల పోలీసులు

 


పిడుగురాళ్ల  పట్టణ, మండల పరిధిలో విచ్చలవిడిగా రెచ్చిపోతున్న మట్టితవ్వకాలకు  సి.ఐ ప్రభాకర్ రావు బ్రేక్ వేశారు.పిడుగురాళ్ల మండలంలోని బ్రహ్మనపల్లి,జగజ్జీవన్ రావు కాలనీ,జానపాడు వివిధ గ్రామాల్లో గత ఆరు నెలలుగా యధేచ్చగా అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నా నామమాత్రపు జరిమానాలతో సర్దుబాటు చేసుకుంటున్న మైనింగ్,రెవిన్యూ అధికారుల తీరుతో అక్రమార్కులకు రెక్కలు వచ్చినట్లుగా వేల టిప్పర్ల తోలకాలతో లక్షలు గడిస్తున్నారు. స్థానిక నాయకుడికి చెప్పే ప్రభుత్వ ఆదాయానికి గోతులు తీస్తున్నామంటూ ప్రగల్పాలు పలుకుతున్న ఛోటా నాయకుల బడా పనులు నేడు ఇళ్ళ మద్యలోనే గుంతలు తవ్వి మట్టిని అమ్ముకోవడంపై స్థానికులు... పోలీసులకు సమాచారం ఇవ్వడంతో 4 ట్రాక్టర్లు,ఒక జెసిబి ని పట్టుకొని  పోలీస్  స్టేషన్ కి తరలించినట్టు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.0/Post a Comment/Comments

Previous Post Next Post