పొలం పని చేసుకుంటున్న యువకున్ని హత్య చేసిన దుండగులు

 


పొలంలో పని చేసుకుంటున్న యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మద్దిరాల శివారులో జరిగింది. మద్దిరాలకు చెందిన లగిశెట్టి కిషన్ పొలంలో... వరుసకు బావమరిది అయిన ధర్మారం మండలం నందిమేడారానికి చెందిన రమేశ్ పని చేస్తున్నాడు. పాలకుర్తి మండలం ముంజంపల్లిలో వివాహ శుభకార్యానికి కిషన్ వెళ్లగా... రమేశ్​ ఒక్కడే ఉదయం 10 గంటలకు పొలంలో పనిచేస్తున్నాడు. కట్​ చేస్తే... 11.30 గంటలకు రమేశ్​ హత్యకు గురయ్యాడు.

పొలం బురద నీటిలో రమేశ్​ మృతదేహాన్ని చూసిన స్థానికులు రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి ట్రాక్టర్​పై ఉన్న రమేశ్​తో మాట్లాడుతూనే ఒక్కసారిగా దాడికి దిగారు. కత్తులతో రమేష్ పొట్ట ముఖం మెడపై పొడిచారు. దుండగుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ... 350 మీటర్ల దూరం వరకు బురద నీటిలో రమేశ్​ పరుగెత్తాడు. అయినప్పటికీ రమేశ్​ను పట్టుకుని హతమార్చారు.ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేరు. ప్రధాన రహదారి అయినప్పటికీ కూడా అటు నుంచి ఎవరూ వెళ్లలేదు. రమేశ్​ తలను తొక్కడం వల్ల అక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పెద్దపల్లి డీసీపీ రవీందర్ యాదవ్​తో పాటు గోదావరిఖని సీఐ రమేశ్​ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రమేశ్​ను చంపాలనుకున్న వారే.... ఎవరు లేరని తెలుసుకుని పక్కా ప్రణాళికతో హత్య చేసినట్లు భావిస్తున్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post