గన్నేరువరం మండల కేంద్రంలో బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సభ

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో  మండల అంబేద్కర్ సంఘం పిలుపు మేరకు ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్  వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది. అంబేద్కర్  చిత్రపటానికి పూలమాలలు వేసి  కొవ్వొత్తులతో నివాళులు అర్పిస్తూ ఆయన చేసిన త్యాగాలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ అల్వాల కోటి, మండల వైస్ ఎంపీపీ న్యాత స్వప్న - సుధాకర్, స్థానిక సర్పంచ్ పుల్లెల్ల లక్ష్మి- లక్ష్మణ్ ఎంపీటీసీ సునీల్, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు జేరిపోతుల మహేందర్ నవయువ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు బామండ్ల రవీందర్, బి. ఎస్. పి మండల అధ్యక్షుడు కల్లేపెల్లి భూమయ్య , కవ్వంపెళ్లి రాజయ్య, న్యాత జీవన్, స్వేరోస్ మండల అధ్యక్షుడు లింగంపల్లి రమేష్, మండల అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు  దమ్మగళ్ళ అనిల్, అమ్మిగల్లా సుధాకర్, కవ్వంపెళ్లి మునిందర్, మాతంగి అనిల్, నగునూరి చుక్కన్న, అనిల్, చంద్రశేఖర్ నాగరాజు, ప్రశాంత్, సాగర్ ,సంతోష్, రాము, రాజేందర్, ప్రశాంత్ పలువురు అంబేద్కర్ వాదులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post