వైసిపి గుండాల చేతిలో తన్నులు తిన్న పోలీసులు ... వీడియో పోస్ట్ చేసిన లోకేష్

 


వైసిపి  నాయకుల చేతిలో పోలీసులు తన్నులు తింటున్నప్పటికీ ఈ విషయాన్ని పోలీసులు బయటపెట్టడం లేదంటూ టీడీపీ నేత నారా లోకేశ్ తెలిపారు. ‘వైసీపీ గూండాల దాడిలో పడిపోయిన పోలీస్’ అంటూ ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘తన్నులు తిని.. వైకాపా వాళ్లతో మసాజ్ చేయించుకున్నాం అని చెప్పడానికి సిగ్గుగా లేదా? పోలీసు శాఖ ఆత్మగౌరవాన్ని వైఎస్ జగన్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టకండి. అధికార పార్టీని ప్రసన్నం చేసుకోవడానికి కొంత మంది పోలీసులు పూర్తిగా దిగజారిపోతున్నారు’ అని లోకేశ్ విమర్శించారు. ‘వైకాపా గూండాల నుండి సాటి పోలీసుల్ని కాపాడుకోలేని వాళ్లు వాస్తవాలు తెలిసినా కళ్లకి గంతలు కట్టుకొని ఫ్యాక్ట్ చెక్ అంటూ ఫాల్స్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు’ అని లోకేశ్ మండిపడ్డారు. ‘పోలీసు గాయపడ్డారు అని మీరే అంటున్నారు. మరి ఎవరి దాడిలో పోలీస్ గాయపడ్డారు? ఆయనకి ఆయనే గాయపర్చుకున్నాడా? ఆ వీడియోలు ఎందుకు బయటపెట్టలేదు? బాడీ వార్న్ కెమెరాల వీడియోలు ఎందుకు మాయం అయ్యాయి? గాయపడిన పోలీసుకి అయింట్మెంట్ రాయాల్సింది పోయి జగన్ రెడ్డి కి అయింట్మెంట్ పుయ్యడం బాధాకరం. వైకాపా గూండాల దాడిలోనే పోలీస్ గాయపడ్డారు. వైకాపా నాయకులు పోలీసుల పై చేసిన దౌర్జన్యానికి సంబంధించిన వీడియోలు బయటపెట్టే ధైర్యం మీకు ఎలాగో లేదు అందుకే నేను విడుదల చేస్తున్నా’ అని చెప్పారు.


https://twitter.com/naralokesh/status/1340173934231109635


0/Post a Comment/Comments

Previous Post Next Post