మీకేమో వేల ఎకరాల్లో పెద్ద పెద్ద ఎస్టేట్లు ఉండాలి పేదవాడు మాత్రం సెంటు భూమి లో ఉండాలా :తంగిరాల సౌమ్య

 


కృష్ణ జిల్లా:కంచికచర్ల మండలం/పరిటాల : పరిటాల గ్రామ అర్హులైన లబ్దిదారులకు వెంటనే ఇళ్ళ పట్టాలను ఇచ్చి న్యాయం చేయాలనీ అలానే భూ బదలాయింపు ప్రక్రియను నిలుపుదల చేయాలనీ గ్రామస్తులు, దేశం నాయకులతో  కలిసి నిరసన తెలియచేసి అనంతరం మండల రెవిన్యూకార్యాలయంలో మెమొరాండం అందచేసిన మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు..

తంగిరాల సౌమ్య మాట్లడుతూ.

నందిగామ పరిటాల గ్రామంలో అతిపెద్ద భూ కుంభకోణం జరుగుతుంది.ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి అసైన్డ్ భూములు తీసుకొని, మళ్లీ వైసీపీ నాయకుల చేత భూములు కొనిపించి వాళ్ల దగ్గర నుంచి భూ బదలాయింపు చేస్తున్నారు.అర్హులైన ఎవరికీ కూడా స్థలాలు ఇవ్వడంలేదు...ఈ భూ దందాల వలన వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగింది.ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాల పేరిట వేల ఎకరాలల్లో భూ దందాలు జరిగాయి.చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కట్టిన జి ప్లస్ త్రీ ఇళ్ల స్థలాలు నిర్మించబడి ఉన్నాకూడా వాటిని అర్హులైన వారికి ఇవ్వకుండా ఎందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతున్నారో అర్థం కావడం లేదు.మీకేమో వేల ఎకరాల్లో పెద్ద పెద్ద ఎస్టేట్లు ఉండాలి పేదవాడు మాత్రం సెంటు భూమి లో ఉండాలా...

0/Post a Comment/Comments

Previous Post Next Post