గుండ్లపల్లి లో అక్రమంగా 40 క్వింటాళ్ల నిల్వ ఉన్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న గన్నేరువరం పోలీసులు

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామంలోని ఓ పాత ఇనుప సామను దుకాణంలో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచారనే నమ్మదగిన సమాచారం మేరకు శుక్రవారం రాత్రి 10 గంటల సమయం లో సోదాలు నిర్వహించగా 35 నుండి 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు గన్నేరువరం ఎస్సై ఆవుల తిరుపతి  తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. ఈ రైడింగ్ లో ఏఎస్సై  దేవేందర్, కానిస్టేబుల్ సంపత్ కుమార్, శ్రీనివాస్, ఉన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post