టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం | హాజరైన మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

 


కరీంనగర్ జిల్లా  మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం రెండోసారి తన రెండేళ్ల పదవిని పూర్తి చేసుకున్నందుకు సంతోశంగా ఉందన్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

తన బలం, బలహీనత కార్యకర్తలే అని అన్నారు. పార్టీకి పునాదులు కార్యకర్తలే అని, వారికి ఎప్పుడు రుణపడి ఉంటానని అన్నారు. రసమయి మాట కేసీఆర్ బాట అన్నారు. తాను మాట్లాడిన వార్తే, మౌనంగా ఉన్న వార్తేనని అన్నారు.14 ఏళ్ళ పాటు నీటి గోసపై పాట పాడిన వాడు మీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అని అన్నారు.ప్రజలు సంతోషంగా ఉండి, అభివృద్ధి జరుగుతావుంటే కొందరు చూసి ఓర్వడం లేదని విమర్శించారు.

తోటపల్లి ని ఆగం చేసింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. కరోనా  కాలంలో ప్రజాప్రతినిధుల జీతాలు వదులుకొని ప్రజలకు 1500 ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. ఊరంటే ఏమిటో అంటే తెలంగాణ రాష్ట్రం వెళ్లి చూడాలనే సందేశాన్ని దేశానికి తెలిసేలా అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. 9కోట్ల రూపాయలు కల్యాణ లక్ష్మీ, 13కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి ని నియోజకవర్గ ప్రజలకు అందజేశామని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ జీవి రామకృష్ణ రావు, ఎంపీపీ కేతిరెడ్డి వనిత రెడ్డి, రాష్ట్ర ఇఫ్కోచైర్మన్ కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి మరియు సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బోయిని తిరుపతి మరియు జడ్పీటీసీ జితేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ నాగల వీరారెడ్డి అల్గునూరు ఎనిమిదవ డివిజన్ సల్ల శారద రవీందర్ రెడ్డి,మార్కెట్ చైర్మన్ ఎలుక వనిత ఆంజనేయులు ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మండల స్థాయి పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post