ఎన్నికలు అనగానే జగన్ కి గుండెలు అదురుతున్నాయ్ : బుద్ధా వెంకన్న

 


ఎపి సియం  జగన్, వైసీపీ పార్టీలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. ఎంత బిల్డప్, ఎంత ఎలివేషన్ ఇచ్చినా ఎన్నికలు అనగానే పారిపోయేవాడిని పిల్లే అంటారని... ఈ విషయాన్ని బులుగు బ్యాచ్ గుర్తించాలని అన్నారు. సవాళ్లు విసిరే బెట్టింగ్ గ్యాంగు ఎన్నికలకు సిద్ధమా? కాదా? అని జగన్ కు సవాల్ విసరాలని సూచించారు.  దొరికందల్లా దోచుకున్న తర్వాత స్థానిక ఎన్నికలేమిటి... ఇంటి నుంచి బయటకు రావాలన్నా భయపడాల్సిందేనని బుద్ధా ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలన్నింటినీ గాల్లో కలిపేసిన జగన్ రెడ్డికి ఫ్యూచర్ అర్థమైందని... అందుకే పంచాయతీ ఎన్నికలు అనగానే గుండెలు అదురుతున్నాయని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.


https://twitter.com/BuddaVenkanna?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1348606471580176386%7Ctwgr%5E%7Ctwcon%5Es2_&ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Fflash-news-706313%2Fjagan-understood-his-future-says-budda-venkanna


0/Post a Comment/Comments

Previous Post Next Post