జంగపల్లి క్రీడాకారిణికి గల్ఫ్ సేవా సమితి ఆధ్వర్యంలో సన్మానం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గల్ఫ్ సేవా సమితి ఆధ్వర్యంలో జంగపల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన జాతీయ క్రీడాకారిణి రాపోలు అర్చనను మేమెంటో తో పాటు రెండు వేల రూపాయల నగదు బహుమతి అందించి  ఘనంగా సన్మానించారు అర్చన జాతీయ స్థాయి పాఠశాలల సైకిలింగ్ పోటీలో రెండు సిల్వర్ మెడల్ సాధించి  తెలంగాణ రాష్ట్రానికి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించి పూణేలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడమే కాకుండా క్రీడా కోటాలో బాసర త్రిబుల్ ఐటీ లో సీటు సాధించింది జాతీయస్థాయిలో క్రీడల్లో రాణించేలా కృషి చేసిన పాఠశాల HM ఆంజనేయులు, PD రవి గారిని "జంగపల్లి గల్ఫ్ సేవా సమితి"వారు శాలువతో సన్మానించారు గన్నేరువరం మండల ప్రజా ప్రతినిధులు అధికారులు  అర్చన ను అభినందించి సన్మానించారు.                     

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అట్టికం శారద శ్రీనివాస్ గౌడ్ ,ఎంపీటీసీ అట్టికం రాజేశం గౌడ్, SMC ఛైర్మన్,వైస్ ఛైర్మన్, పాఠశాల ఉపాధ్యాయని,ఉపాధ్యాయులు జంగాపల్లి గల్ఫ్ సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post