అయోధ్య రామమందిర నిర్మాణం లో భాగస్వాములు కండి - శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర

 


కరీంనగర్ జిల్లా: అయోధ్య రామమందిర నిర్మాణం కొరకు నిధి సమర్పణ లో భాగంగా హిందూ ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బొంతల కళ్యాణ్ చంద్ర కోరారు.  శ్రీ రామ మందిరం నిధి సమర్పణ ఉద్యమంలో భాగంగా బుధవారం అలుగునూర్ లోని మనేరు నగర్( శ్రీ వెంకటేశ్వర కాలనీ ) లో గల శ్రీ రామ సాయి& శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో నిధి సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది .. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువుల చిరకాల స్వప్నమైన అయోధ్య రామమందిర నిర్మాణం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.. 500 సంవత్సరాల పోరాటం, లక్షల మంది  బలిదానం  అయోధ్య రామమందిర నిర్మాణం కోసం జరిగిందని తెలిపారు. నేడు హిందువులందరికీ ఆమోదయోగ్యమైన  తీర్పు వచ్చిందని, రాముడు అందరివాడిని, అయోధ్యలో రాముడి నివాసం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన అవసరం ఉందన్నారు. వాడ వాడ లోని ప్రజలందరూ రామ నిధి సమర్పణ లో పాలుపంచుకోవాలని, ఉడతా భక్తి తో అయోధ్య రాముని కి నిధి సమర్పించాలని ఆయన కోరారు.  గొప్పదైన రామ కార్యంలో భాగస్వామ్యం అవ్వడం మనం అదృష్టంగా భావించాలి అని అన్నారు. తదనంతరం అలుగునూర్ లోని శ్రీ వెంకటేశ్వర కాలనీ లో  నిధి సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామ సాయి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ అధ్యక్షులు నరసయ్య. అర్చకులు శంకర్ శర్మ, రామ భక్తులు తోట నరేష్, అల్లాడి కార్తీక్, శ్రీను, అను మల్ల సురేష్, తేజ, అక్షయ్ , మల్లయ్య తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post