ప్రతీ గ్రామంలో బూత్ స్థాయిని పటిష్టం చేయండి : బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి

 


 కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం: మండలంలోని ప్రతీ గ్రామంలో బూత్ ల వారిగా కార్యావర్గాన్ని ఎన్నుకొని పటిష్టపరచాలని బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి సూచించారు. మండలంలోని పర్లపల్లి గ్రామంలో బూత్ ల సంస్థాగత నిర్మాణంపై ఆదివారం మండల శాఖ ఆధ్వర్యంలో సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా ముఖ్యఅతిధిగా హాజరైన కృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పతకాలు గ్రామాల్లో పూర్తిస్థాయిలో ప్రచారం జరగాలంటే బూత్ స్థాయి కార్యకర్తలే ముఖ్యమని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల విజయం వెనుక పటిష్టమైన బూత్ స్థాయి కార్యకర్తల కృషి ఉన్నదని అన్నారు.కేంద్రం ఇస్తున్ననిధులు దారిమళ్లుతున్నాయని అట్టి విషయాలను ప్రజలకు తెలప్పాల్సిన భాద్యత బిజెపి కార్యకర్తలదెనని  తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి,అక్రమాలపై సమయాకూలంగా నిరసనలు తెలపాలని సూచించారు.ప్రభుత్వ పనుల్లో జరిగే అక్రమాలపై ఎప్పటికప్పుడు అధికారులకు పిర్యాదులు చేయాలని తెలిపారు. ఇలాంటి విషయాల్లో కార్యకర్తలపై ఏమైనా వేధింపులు ఉంటే పార్టీ అండగా ఉంటుందని ఎవ్వరు కూడా భయపడవద్దని తెలిపారు.టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను, నాయకుల దౌర్జన్యాలపై ప్రశ్నించే సత్తా ఒక్క బిజెపి కే ఉందని అన్నారు. కార్యకర్తల కృషితోనే రానున్న రోజుల్లో బిజెపి అధికారం లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. పార్టీ పిలుపుమేరకు ప్రతీ కార్యకర్త కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలసమస్యల్లో పాలుపంచుకోవాలని తెలిపారు.ఎన్నికలేవైనా గెలుపు ప్రజలు బిజెపీ కే ఓట్లు వేసేలా కార్యకర్తలు పనిచేయాలని అందుకోసం అన్నీ గ్రామాల్లో బూత్ లను పటిష్టపరిచి ఆదర్శంగా ఉండాలని సూచించారు.అనంతరం పర్లపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన  సీనియర్ నాయకులు చీకట్ల నారాయణ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించి ఆయన మృతికి కారణాలు తెలుసుకొని ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కరివేద జగన్ రెడ్డి, నేరెళ్ల సంపత్ కుమార్,మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి, ప్రధాన కార్యదర్శులు గొట్టిముక్కుల తిరుపతి రెడ్డి,కిన్నెర అనీల్,ఉపాధ్యక్షుడు తమ్మనవేణి రాజు యాదవ్,జిల్లా ఈసీ మెంబర్స్ తమ్మిశెట్టి మల్లయ్య,బూట్ల శ్రీనివాస్, మావురపు సంపత్,కార్యదర్శులు పడాల శ్రీనివాస్ గౌడ్,పల్లె కుమార్,అధికార ప్రతినిధి జంగ సునీల్ రెడ్డి,ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దుర్సెట్టి రమేష్,సోషల్ మీడియా కన్వీనర్ ఐల రాజశేఖర్,ఒడ్డేపల్లి కనకయ్య,కొమ్మెర రాజిరెడ్డి,అన్నాడి రమణారెడ్డి,కాల్వ శ్రీనివాస్ యాదవ్,అన్వేష్,రేగుల శ్రీనివాస్,కీసర సతీష్,గుమ్మడి రాజు,కీసర గోపాల్,మూడపెల్లి శ్రీనివాస్,నరేష్,బూర్గు శ్రీనివాస్ రెడ్డి,దరిపేల్లి అజయ్ తదితరులు ఉన్నారు.


0/Post a Comment/Comments

Previous Post Next Post