ప్రముఖ పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావు మృతి ప‌ట్ల వి.సుధాకర్ సంతాపం ప్రముఖ పాత్రికేయుడు, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు (87) క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు.

'సీనియర్ పాత్రికేయుడిగా, గొప్ప వక్తగా, రచయితగా తుర్లపాటి కుటుంబరావుగారి సేవలు శ్లాఘనీయం. పద్మశ్రీ, కళాప్రపూర్ణ తదితర అనేక పురస్కారాలే తుర్లపాటి ప్రతిభకు తార్కాణాలు. ఆయన మృతితో బహుముఖ ప్రజ్ఞావేత్తను రాష్ట్రం కోల్పోయింది. తుర్లపాటి కుటుంబరావుగారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా (PEMRAINDIA) జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్ ట్వీట్ చేశారు .

https://t.co/EIDVqZE9dr


0/Post a Comment/Comments

Previous Post Next Post