BSP పార్టీలో చేరిన అర్కండ్ల గ్రామ ప్రజలు 2022 లో BJP రాజ్యాంగం ను మార్చబోతుంది. తద్వారా మనం ( BC,SC, ST మత మైనారిటీ , అగ్రకుల నిరుపేదలు) శాశ్వత బానిసలం అవుతామని BSP జిల్లా అధ్యక్షుడు నిశాని రామచంద్రం అన్నారు  కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అర్కండ్ల గ్రామంలో మండల కన్వీనర్ బెజ్జంకి చందు ఆద్వర్యంలో జరిగిన సదస్సు కు ముఖ్య అతిథిగా హజరయ్యి  ప్రసంగించారు. రాజ్యాంగం లేకముందు మనుధర్మం ప్రకారం మనలను బానిసలు చేసి అన్ని హక్కులకు దూరం చేస్తే , బహుజన మహానీయులైన ఫూలే, సాహూ, అంబేద్కర్ ల వలన మనకు చదువు, రిజర్వేషన్లు, శాశ్వతమైన హక్కులు లభించాయి. అయితే నేడు BJP  రాజ్యాంగం ను మార్చబోతుంది. మనం మళ్లి బానిసలు కాకుండా ఉండాలంటే మనం BSP ని బలపరిచి, సోదరి మాయావతి గారిని ప్రధాని చేసినపుడే రాజ్యంగం రక్షించబడుతుంది అన్నారు.  అనంతరం వివిధ పార్టీ ల నుండి 30 మంది యువకులు పెద్దలు, మహిళలు పార్టీ లో చేరగా  వారికి కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. 

ఈ కార్యక్రమం లో నియోజకవర్గ అధ్యక్షుడు సంగుపట్ల మళ్లేషం, సీనియర్ నాయకులు సిరిసిల్ల అంజయ్య, యామునూరి మధు, యామునూరి సారయ్య, వినయ్, నవీన్ , హరీష్ బాబు, కుమార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post