టిడిపి మద్దతుతో గెలిచి .. తెల్లారి వైసీపీలో చేరిన స్వతంత్ర అభ్యర్థులు

 


ఆంధ్రప్రదేశ్  పంచాయతీ ఎన్నికల్లో ఓ పార్టీ మద్దతుతో గెలిచిన నేతలు.. మరో పార్టీకి మారిపోతున్నారు. చాలా చోట్ల అధికార పార్టీకి రెబల్ అభ్యర్థుల బెడద ఎక్కువైంది. చాలా చోట్ల రెబల్ అభ్యర్థులు గెలవడంతో వారిని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది. అధికార వైసీపీ పలువురు అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తూ పార్టీలోకి లాక్కుంటోందని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది.ఎమ్మెల్సీ దొరబాబు సొంత నియోజకవర్గమైన బంగారుపాళ్యం మండలంలోని బొమ్మాయిపల్లెలో టీడీపీ మద్దతుతో గౌరమ్మ అనే అభ్యర్థి గెలిచారు. అయితే, రాత్రికి రాత్రే ఆమె పార్టీ మారారు. వైసీపీ నేత కుమార్ రాజా ఆధ్వర్యంలో ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు. అలాగే చిత్తూరు మండలంలోని చింతలకుంట పంచాయతీలో గెలిచిన గీతాంజలి కూడా వైసీపీలో చేరారు. ఆమె కూడా టీడీపీ మద్దతుతోనే గెలిచారు. పూతలపట్టు మండలానికి చెందిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులూ వైసీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post