అన్ని కోణాల్లో దర్యాప్తు... నిందితులు ఎంతటివారైనా వదిలేది లేదు : సీపీ రామగుండం

 


రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మంథని కి 16 కిలోమీటర్లు దూరం లో ఉన్న కల్వచర్ల  వద్ద సుమారు 2:30 గం,, ప్రాంతంలో మంథని నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న హైకోర్టు న్యాయవాదులు  గట్టు వామనరావు గట్టు నాగమణి లు ప్రయాణిస్తున్న కారు ఆపి గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేయడం జరిగింది. వారిని 108 వాహనంలో పెద్దపల్లి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోవడం జరిగింది. దుండగులను పట్టుకోవడం కొరకు  ప్రత్యేకమైన ఆరు టీమ్లను ఏర్పాటు చేసి  గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహించడం జరుగుతుంది. దుండగులు ఎంతటి వారైనా వదిలేదు అని సీపీ సత్యనారాయణ ఐపీఎస్ గారు తెలిపారు.0/Post a Comment/Comments

Previous Post Next Post